Sat. Jan 31st, 2026

కొత్తగూడెం పట్టణంలో అన్నపూర్ణ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నప్రసాద వితరణ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తూము.చౌదరి, కోనేరు.చిన్ని పాల్గొని అన్నప్రసాద వితరణ ప్రారంభం చేశారు. ఈసందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. భవిష్యత్తులో ప్రతి పౌర్ణమి అమావాస్య రోజున ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతుందని అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పూణెo. శ్రీనివాస్,మైనార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ పాషా,దళిత హక్కుల నాయకులు అంతడపుల.కృష్ణ, మాజీ సర్పంచ్ బండ. వెంకటేశ్వర్లు, అయబ్ ఖాన్, బహుజన నాయకులు ఉయ్యూరు.శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Share this post...