భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం 23వ తేదీన ప్రకాశం స్టేడియంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు జరగనున్నాయని అసోసియేషన్ అధ్యక్షుడు బి. మంజీలాల్,కార్యదర్శి కె.నాగలక్ష్మి తెలియజేశారు. ఈ పోటీలు 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75, 80 ఏళ్ల వయస్సు వర్గాలకు చెందిన మహిళలు, పురుషుల కోసం పరుగులు, త్రోస్, జంప్స్ విభాగాల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.ఆసక్తి ఉన్న అభ్యర్థులు నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు బి.మంజీలాల్ సెల్ ఫోన్ నెంబర్ 98667 07982,నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెక్రెటరీ కె.నాగలక్ష్మి .. సెల్ ఫోన్ నెంబర్ 9515497794 సంప్రదించగలరని కోరారు.
