భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ELTA యూనిట్ సూచనల మేరకు గిరిజన సంక్షేమ శాఖ ఆంగ్ల ఉపాధ్యాయుల సమావేశం భద్రాచలం ఉపాధ్యాయులు ట్రైనింగ్ కేంద్రంలో జరిగింది.ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఏ జి హెచ్ ఎస్ రేగుపల్లి – 1 పాఠశాల కు చెందిన స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుడు బి.రఘునందన్ సింగ్ కన్వీనర్‌గా ఎంపిక కాగా, ఏ జి హెచ్ ఎస్ డి.గొల్లగూడెం పాఠశాలకు చెందిన స్కూల్ అసిస్టెంట్ బి.అరుణ కో–కన్వీనర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఉపాధ్యాయుల సమన్వయం,విద్యా కార్యకలాపాల పటిష్టీకరణలో కొత్త కన్వీనర్లు కీలక భూమిక పోషిస్తారని ఈ ఎల్ టి ఏ ప్రతినిధులు ఆకాంక్షించారు
