Tue. Feb 3rd, 2026

       భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మండల శాఖ 12వ మహాసభ మండల అధ్యక్షులు కారం సీతారామయ్య అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభలో విశిష్ట అతిథిగా యోగితా వేణి పీజీహెచ్ఎం, టీఎస్ యుటిఎఫ్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.ముఖ్య అతిథిగా ఎన్ కృష్ణ పాల్గొని మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు పిఆర్సి నివేదికను తెప్పించి వెంటనే అమలు చేయాలని, సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.జిల్లా కార్యదర్శి బి రాము పాల్గొని మాట్లాడుతూ ఇప్పుడు అకస్మాత్తుగా ఐదు సంవత్సరాలు సర్వీస్ కలిగిన ఉపాధ్యాయులందరూ తాము సర్వీసులో కొనసాగాలంటే మరియు ప్రమోషన్ పొందాలంటే ఉపాధ్యాయులు తప్పక ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ పాస్ అవ్వాలని నిబంధన విధించడం సరికాదని తెలిపారు. మండల మహాసభలో సంవత్సర కాలంగా జరిగిన కార్యకలాపాల నివేదికను ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ చంద్రు ప్రవేశపెట్టగా ప్రతినిధులు చర్చించి ఆమోదించారు. అనంతరం మండల శాఖకు సంబంధించిన నూతన కమిటీ ఎన్నిక జరిగింది.ఈ ఎన్నికకు ఎన్నికల అధికారిగా రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్ కృష్ణ జిల్లా కార్యదర్శి బి రాము వ్యవహరించారు. నూతన కమిటీ అధ్యక్షులుగా కారం సీతారామయ్య, ప్రధాన కార్యదర్శిగా ఇస్లావత్ చంద్రు, ఉపాధ్యక్షులుగా బానోత్ మంగీలాల్ నాయక్,మహిళా ఉపాధ్యక్షురాలుగా జి సునీత, కోశాధికారిగా సలిందర్ సింగ్ (సోనీ),కార్యదర్శులుగా నాగేశ్వరరావు,సురేష్ , ముసిరా,సుధీర్,మహిళా సబ్ కమిటీ కన్వీనర్ గా ఎం.వి లక్ష్మి ప్రసన్న ,ఆడిటర్ గా రామకృష్ణయ్య,ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ కన్వీనర్ గా వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Share this post...