
చండీగర్ లోని పంజాబ్ యూనివర్సిటీలో ఈనెల డిసెంబర్6 నుండి డిసెంబర్9 తేదీ వరకు జరిగే ఇండియ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ లో జరిగే సైన్స్ సఫారీ టీచర్ వర్క్ షాప్ కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం కాకర్ల ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న బి. సంపత్ కుమార్ (భౌతిక శాస్త్ర) ఉపాధ్యాయుడు మరియు జిల్లా సైన్స్ అధికారి అయినా బి సంపత్ కుమార్ ఎంపిక అయ్యారు. ఈ మేరకు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఇండియా వారి నుంచి ఆహ్వానాన్ని బి సంపత్ కుమార్ అందుకున్నారు. ఈ వర్క్ షాప్ లో “ఉపాధ్యాయ బోధనలు-మేలకువలు” అనే అంశంపై వర్క్ షాప్ లో పాల్గొంటున్నారు, ఈ వర్క్ షాప్ లో మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ఉపాధ్యాయులు తో పాటు ఇతర దేశాలకు చెందిన ఉపాధ్యాయులు హాజరవుతున్నారు.ఇండియన ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ లో జరిగే టీచర్స్ సైన్స్ సఫారీ వర్క్ షాప్ కు బి సంపత్ కుమార్ ఎంపిక పట్ల జిల్లావిద్యాశాఖ అధికారి బి నాగ లక్ష్మీ గారు, ఏఎంఓ నాగరాజశేఖర్, ఎం.ఇ.ఓ. బి. జంకిలాల్, కాకర్ల హెడ్మాస్టర్ పి.సంజీవరావు, స్కూలు ఉపాధ్యాయ బృందం జిల్లా సైన్సు ఉపాధ్యాయులు ఆయన్ని అభినందించారు.
