మారేడుమిల్లి ఎన్కౌంటర్ పై నిజ నిర్ధారణకు వెళ్లిన ఉస్మానియా యూనివర్సిటీ,కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను అక్రమ నిర్బంధం చేయడానికి CPI MLC నెల్లికంటి సత్యం తీవ్రంగా ఖండించారు…ఈ సందర్భంగా హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు స్పందిస్తూనే ఉంటారు అదేవిధంగా మారేడుమిల్లి ఎన్కౌంటర్ పై వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం కోసం వారు ముందుగానే మావోయిస్టులకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, ఆంధ్రప్రదేశ్ డీజీపీకి బహిరంగంగానే లేఖలు రాశారని గుర్తు చేశారు.ఆ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వారు వెళుతున్న వాహనాలను ఆపి విద్యార్థులను అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోలీస్ స్టేషన్ లో అక్రమంగా నిర్బంధించడాన్ని అందరూ తీవ్రంగా ఖండించాలని కోరారు.తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు….
