భారతరత్న అంబేద్కర్ మన దేశానికే గర్వకారణమైన మహనీయుడు! వారి ఆశయాల సాధనకై అందరూ కృషి చేయాలనీ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. విభిన్న మతాలు విభిన్న జాతులు,కులాలు విభిన్న సాంప్రదాయాలు,సంస్కృతులు కలగలిసిన భారతదేశంలో తన అపరిమిత మేదస్సుతో భారత రాజ్యాంగాన్ని రచన చేసి,ఆ రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాలు,దళితులు గిరిజనులు, వెనుకబడిన తరగతులు,మైనారిటీలు మహిళలు మరియు అగ్రవర్ణాలలోని పేద వర్గాలకు కూడా సమ ప్రాధాన్యాన్ని కలిగించి,రిజర్వేషన్ల ద్వారా వారి జీవితాలను అన్ని రంగాలలో అభివృద్ధి పరిచి, సామాజిక న్యాయం సమసమాజ స్థాపన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన త్యాగధనుడు, భారతదేశం గర్వించదగిన మహనీయుడు భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్… వారి ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కొత్తగూడెం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కూనంనేని సాంబశివరావు గారు ఉద్ఘాటించారు.భారతరత్న అంబేద్కర్ 169 వ వర్ధంతి సందర్భంగా స్థానిక అంబేద్కర్ సెంటర్ (హెడ్ పోస్ట్ ఆఫీస్) వద్దగల అంబేద్కర్ గారి విగ్రహం వద్ద భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం మరియు దళిత బహుజన సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేసిన వేడుకలలో కూనంనేని ముఖ్యఅతిథిగా పాల్గొని,దళిత ప్రముఖ నాయకులందరితోపాటు అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించి, తమ సందేశాన్ని అందించారు. అనంతరం దళిత సంఘాల ప్రముఖ నాయకులు ఆచార్య డాక్టర్ శివకుమార్ కూసపాటి శ్రీనివాస్ తాండ్ర వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఈ సమాజానికి అంబేద్కర్ ఇజం ఒక్కటే మార్గదర్శకమని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, అవి అమలు జరిగేటట్టుగా ప్రభుత్వాన్ని ముందుకు నడిపించాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశానికి దళిత బహుజన నాయకుడు తాండ్ర వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు.ఘనంగా జరిగిన ఈ వేడుకలలో శాసనసభ్యులు కూనంనేని,ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ , కూసపాటి శ్రీనివాస్ ,తాండ్ర వెంకటేశ్వర్లు , పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్లు కరుణాకర్ చెన్నూరి శ్రీనివాస్,మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గడ్డిపల్లి కవిత,భద్రాద్రి కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న,జిల్లా కాంగ్రెస్ పార్టీ యువజన సంఘం అధ్యక్షులు చీకటి కార్తీక్, కుంజా కవిత లతోపాటు, దళిత సంఘాల ప్రముఖ నాయకులు జె బి శౌరి, ఎర్రా కామేష్ సింగరేణి రిటైర్డ్ జిఎం అందెల ఆనందరావు ,మంద హనుమంతు, బొమ్మెర శ్రీనివాస్ చింతలచెరువు గిరీశం, మల్లెల రామనాథం, గుండా రమేష్ మారపాక రమేష్ కోట శివశంకర్ , బొంకూరి పరమేష్ కోదాడ శ్రీనివాస్ , విశారదన్ అనుచరుడు సంజీవ్ అల్లిశంకర్ పి సురేందర్ తమ్మల్ల రవి జోసెఫ్, దంసలపూడి భాస్కర్,చదలవాడ సూరి,అంకినీడు ప్రసాద్, మద్దెల సుధీర్ , కేదాసి పీటర్ బాబు, అశ్షు,దళిత మహిళా సంఘాల నాయకురాళ్ళు బడికల పుష్పలత, జోగు రమాదేవి,కుంచె లావణ్య స్వర్ణలత, మాట్ల గాయత్రి,మందా చంద్రకళ,రామ్ నరసింహ రాజేశ్వరరావు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
