చుంచుపల్లి బాబు క్యాంప్ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రముఖ న్యాయవాది కాంగ్రెస్ లీగల్ సెల్ రాష్ట్ర సభ్యులు మారపాక రమేష్ కుమార్ అన్నారు.బుధవారం పార్టీ శ్రేణులతో కలిసి బాబుక్యాంపు ఎనిమిదవ వార్డు నుంచి కాంగ్రెస్ బలపరుస్తున్న అభ్యర్థి ముక్కెర శ్రీనివాస్ గెలుపు కొరకు వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ బాబుక్యాంపు తొ పాటు ప్రతీ గ్రామపంచాయతీలో అభివృద్ధిని వేగవంతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్ధులను గెలిపించాలన్నారు.8వ వార్డ్ నుంచి ముక్కెర శ్రీనివాస్ @ గొల్ల శ్రీనివాస్ నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో కృషి చేస్తున్నారని గ్రామాభివృద్ధిపై కట్టుబాటు,గ్రామ ప్రజలకు మరింత సేవా చేసేందుకు సీరియల్ నంబర్ 2 గ్యాస్ స్టౌవ్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో అభ్యర్థి గొల్ల శ్రీను,శివజ్యోతి,ప్రకాశ్,బాబ్జీ,జెల్లీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
