భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా భద్రాచలం ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ (ఆంగ్లం) పి.ఎస్.వి. ప్రసాద్ బాబు ఎంపికయ్యారు. దాదాపు 17 ఏళ్లుగా ప్రభుత్వ విద్యారంగంలో సేవలందిస్తున్న ఆయన వేలాది మంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దారు. గ్రామీణ, పేద విద్యార్థుల్లో ఆంగ్ల భాషపై భయాన్ని తొలగించి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో విశేష కృషి చేశారు. వినూత్న బోధనా పద్ధతులతో పాటు పాఠశాల అభివృద్ధి, గ్రంథాలయాల ఏర్పాటు, విద్యార్థుల సంఖ్య పెంపులో కీలక పాత్ర పోషించారు. ఆయన బోధించిన పాఠశాలల్లో ఆంగ్లంలో మెరుగైన ఉత్తీర్ణత సాధించడంతో పాటు పలువురు విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ఉన్నత విద్యను అభ్యసిస్తూ, కెరీర్ కౌన్సిలర్‌గా గ్రామీణ విద్యార్థుల కు మార్గదర్శకత్వం అందిస్తున్నారు. ఉపాధ్యాయుడిగా, రచయితగా,సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా ఆయన చేస్తున్న సేవలకు ఈ పురస్కారం తగిన గుర్తింపుగా నిలిచింది. విద్యార్థుల విజయాన్నే తన అసలైన గౌరవంగా భావించే ప్రసాద్ బాబు ఎంపిక పట్ల విద్యావర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
