ఖమ్మం: ఎన్టీఆర్ సర్కిల్‌లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని విద్యార్థులు ఉపాధ్యాయుల వేషధారణలో తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు.ప్రిన్సిపాల్ రావూరి నివేదిత మాట్లాడుతూ విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. కార్యక్రమంలో చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, ఏజీఎం చేతన్ మధుర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
