కొత్తగూడెం1 శ్రీ చైతన్య పాఠశాల కొత్తగూడెం-1లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కల్యాణి మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. విద్యతో పాటు విలువలు, క్రమశిక్షణ, నైతికతను బోధిస్తూ మంచి భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేస్తారని తెలిపారు.హైస్కూల్ కోఆర్డినేటర్ చెంచల బాబు, ప్రైమరీ కోఆర్డినేటర్ మాధవి ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ గురువులకు శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞతలు చాటుకున్నారు.
