Sun. Sep 6th, 2026

సుజాతనగర్ మండలం సర్వారం ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన కీ.శే. డి. సీతారామయ్య కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కుటుంబ సంక్షేమ నిధి ద్వారా రూ.6 లక్షల చెక్కును అందజేశారు.ఆదివారం కొత్తగూడెంలోని ఉపాధ్యాయుల భవన్‌లో జిల్లా కుటుంబ సంక్షేమ నిధి సమన్వయకర్త దాసు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయ సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు. ఉద్యోగి కుటుంబానికి ఆపద సమయంలో అండగా నిలిచేందుకు కుటుంబ సంక్షేమ నిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో టి ఎస్ యు టి ఎఫ్ రాష్ట్ర,జిల్లా,మండల నాయకులు మరియు యు టి ఎఫ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Share this post...