సోమవారం ఐడిఓసి కార్యాలయంలో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు రాంబాబు, మధుసూదన్ రాజు, డిఆర్ఓ రవీంద్రనాథ్, పాల్గొన్న అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజలు అందచేసిన దరఖాస్తుల సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సిపార్స్ చేశారు.