ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం వద్ద విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక యువకుడి కి తీవ్ర గాయాలు కాగా స్థానికులు హుటాహుటిన క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి కారణమైన లారీని డ్రైవర్ వదిలి పారిపోయాడు.