ఖమ్మం :డాటా నమోదు, ఎలాంటి పొరపాట్లు లేకుండా ఖచ్చితత్వంతో చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం కలెక్టర్, కొనిజర్ల మండలం తనికెళ్ల గ్రామంలోని విజయ ఇంజనీరింగ్ కళాశాలలో చేపడుతున్న డాటా ఎంట్రీ ప్రక్రియను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎన్ని దరఖాస్తులు ప్రజాపాలన పోర్టల్ లో నమోదు చేసింది, ఏమైనా సందేహాలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. రేషన్, ఆధార్ కార్డు నెంబర్లు జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు. ఫిజికల్ దరఖాస్తులో ఉన్న వివరాలు సరితూగాలన్నారు. డాటా ఎంట్రీని ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. దరఖాస్తులను డాటా ఎంట్రీ ఆపరేటర్లు సూచించిన ప్రదేశంలో మాత్రమే నమోదు ప్రక్రియ చేపట్టాలని ఆయన తెలిపారు.