ఖమ్మం : తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మంజిల్లాలో బుధవారం పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పర్యటనలో భాగంగా ఉదయం పది గంటలకు ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో రైట్ ఛాయిస్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగే ఆత్మీయ అభినందన వేడుకలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం మల్లెమడుగు, ఎదులాపురం, కొండాపురం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన హెల్త్ సెంటర్ భవనాలను ప్రారంభిస్తారన్నారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు కూసుమంచిలోని పాలేరు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందుబాటులో ఉంటారని దయాకర్ రెడ్డి తెలిపారు.