Sat. Dec 21st, 2024

బిఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం ఖాయంరేగా

అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ చెందిన సుమారు 200 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో చేరిక గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు . గురువారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సమక్షంలో అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మండలం లోని రామానుజారం గ్రామం, మరియు మున్సిపాలిటీ పరిధిలోని మేదరబస్తీ ఏరియాలలో కాంగ్రెస్ పార్టీ సహా ఇతర పార్టీలకు చెందిన సుమారు 200 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు, వారికి గులాబీ కండువా లు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ఆయన అన్నారు సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్షా అని ప్రజలు రాష్ట్రంలో మరోసారి బిఆర్ఎస్ దే అధికారమని ఆయన అన్నారు, పార్టీని నమ్ముకుని వచ్చిన వారికి అండగా ఉంటామన్నారు పార్టీ కోసం పనిచేసే వారికి సంచిత స్థానం కల్పిస్తామన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వం ప్రజలు కోరుకుంటున్నారు కార్యకర్తలు ఎల్లవేళలా ఉంటూ వారి సంక్షేమం కోసం కృషి చేస్తాను అన్నారు, ఈ నెల 13వ తేదీన బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు కార్యకర్తలు పార్టీ శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు, అదేవిధంగా నెల 30 తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.

Share this post...