Sat. Dec 21st, 2024

-సిపిఎం పార్టీ అభ్యర్థికి జూలూరుపాడు మండలంలో ఘన స్వాగతం పలుకుతున్న మండల ప్రజలు.

జూలూరుపాడు :- మండలంలోని ప్రజాసంఘాలు బలపరిచిన సిపిఎం పార్టీ అభ్యర్థి భూక్యా వీరభద్రం ఈ రోజు జూలూరుపాడు మండలంలోని విస్తృత పర్యటన చేయటం జరిగింది. మండలంలోని ప్రజలు ఘనస్వాగతం పలకడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ అభ్యర్థి భూక్య వీరభద్రం మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకొచ్చిన బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని అన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీలకే పరిమితమైన ప్రభుత్వం ఒక్క నిరుద్యోగి కూడా ఒక రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. నిరుద్యోగులు ఆలోచించి ఓటేయాలని అన్నారు. పోడు భూముల కోసం పోడు పట్టాలు వచ్చేంతవరకు ఎన్నో నిర్బంధనలు ఎదుర్కొని జైళ్లకు వెళ్లి చావుని సైతం లెక్కచేయకుండా పోరాడినటువంటి ఘనత కేవలం ఎర్రజెండాలదే సిపిఎం పార్టీదాని అన్నారు. మిగిలిన అటువంటి పోడు భూములకు కూడా పట్టాలు ఇచ్చేంతవరకు మీ అందరూ ఆదరిస్తే అసెంబ్లీలో ప్రభుత్వంతో కొట్లాడి పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తాం అన్నారు. ప్రతి పేదవాడికి ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇచ్చేంతవరకు సిపిఎం జండాను పట్టుకొని పోరాటం చేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ స్కీములతో మోసపూరిత హామీలు ఇస్తుందని అన్నారు. 60 ఏళ్ల పాలల్లో పేదలకు చేసింది ఏమీ లేదని అన్నారు. ప్రజలు మోసపోవద్దని సూచించారు.

Share this post...