…. రాజకీయ కుట్ర లో కోయ సోదరులు ఆగం కావద్దు.
….. గిరిజన చట్టాలను పకడిబందీగా అమలుకై కలసి యుద్ధం చేద్దాం.
…… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జేఏసీ ఆధ్వర్యంలో లంబాడీల ఆత్మగౌరవ మహా ర్యాలీ.
…….. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం.
J365 NEWS,Kothagudem: లంబాడి తెగను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని కోయ తెగ వర్గం చేస్తున్న దుష్ప్రచారాన్ని సమాజానికి తెలియజేసేందుకు లంబాడి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం లంబాడీల ఆత్మగౌరవ మహా ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
లక్ష్మీదేవి పల్లి మార్కెట్ యార్డ్ నుండి సూపర్ బజార్. బస్టాండ్. ఏరియా మీదుగా పోస్ట్ ఆఫీస్ సెంటర్ వరకు మహా ర్యాలీని నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రాన్ని అందించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా జేఏసీ నాయకులు మాట్లాడుతూ….. భారత రాజ్యాంగం మాకు కల్పించిన హక్కుతోనే మేము ఎస్టీలుగా రాజ్యాంగబద్ధంగా గుర్తించామని. అది సక్రమమే కానీ అక్రమం కాదని కోయ సోదరులు అర్థం చేసుకోవాలని వారు చేస్తున్న ఆరోపణలో నిజం లేదని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఈ కేసును కొట్టేయడం జరిగిందని కోయ సోదరులు గమనించాలని కోరారు. రాజకీయ లబ్ధి కోసం ఎవరో కుట్ర చేస్తే అన్నదమ్ములుగా కలిసి ఉన్న మనం వారి మాటలను నమ్మి ఆగం కావద్దని విజ్ఞప్తి చేశారు. భారత రాజ్యాంగం కల్పించిన చట్టాలను మనమందరం గౌరవించాలని చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించి దిశా నిర్దేశం చేసుకోవాలని పేర్కొన్నారు. లంబాడీల మనోభావాలను దెబ్బతీసే విధంగా తరచుగా మాపై దుష్ప్రచారం చేస్తే లంబాడి సమాజం సహించబోదని హెచ్చరించారు. రాష్ట్ర. కేంద్ర ప్రభుత్వం నుండి గిరిజనులకు రావాల్సిన వాటా కోసం అన్నదమ్ములై కలిసి గిరిజన చట్టాలను పకడ్బందీగా అమలు చేసేందుకు యుద్ధం చేద్దామని పిలుపునిచ్చారు. ప్రభుత్వం గిరిజనుల కోసం కేటాయించబడుతున్న నిధులను పక్కదారి పట్టిస్తున్నారని. ఆ నిధులను గిరిజనుల అభివృద్ధి కోసం ఉపయోగపడేలాగా కార్యచరణ చేపట్టి నిధులను సాధించుకోవాలని కోరారు.
లంబాడీల ఆత్మ గౌరవ మహా ర్యాలీ…. కాంగ్రెస్ ద్వంద వైఖరి విడాలి
లంబాడీలు అక్రమంగా వచ్చార సక్రమంగా వచ్చార అనేది ప్రభుత్వ ప్రకటన చేయకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
రాజ్యాంగ బద్దంగా లంబాడీలు గిరిజన జాబితాలో చేర్చారు అనే విషయం తెలిసి కూడా మమ్ములను అవమానించడం దారుణం మా ఆత్మగౌరం కొరకు ఎంత వరకు అయినా వెళ్తాం అని హెచ్చరించారు. రాహుల్ గాంధీ నమ్మే రాజ్యాంగం ఇక్కడఅమలు అవుతుందా లేదా అనీ ప్రభుత్వం స్పందించకుంటే ఆత్మగౌరవ పోరాటాలు నిరవహిస్తూనే ఉంటామని హెచ్చరిస్తున్నామని ఎస్టీ జాబితా నుండి తొలగించాలని వేసిన కేస్ మీద కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఖండిస్తున్నాం.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వైపు ఆదివాసీలతో సమావేశాలు ఇంకొక వైపు లంబాడీ ప్రజా ప్రతినిధిలతో సమావేశాలు నిర్వహించటం సమస్య పరిష్కారం చేయకపోగా ఎవ్వరికీ చెప్పాల్సింది వారికి చెప్పి ఆదివాసులు లంబాడీ లు రోడ్లు ఎక్కి కొట్టుకునేల చర్యలున్నాయని ఆరోపించారు,ఇంకా మా సామాజిక వర్గ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి పరోక్షంగా భయపెట్టడం కాదు సీఎంకు చిత్తశుద్ధి ఉంటే వారి పార్టీ లో ఉన్న భద్రాచలం ఎంఎల్ ఏ తెల్లం వెంకట్రావు ని సోయం బాపూరావు గారిని పిలిచి కేసును ఉపసంహరించు కునేలా చేసే అవకాశం ఉండగా ఎందుకు కావాలని ఈ సమస్యను పెద్దదిగా చేస్తున్నారని ప్రశ్నించారు తెల్లం వెంకట్రావ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికు ప్రధాన అనుచరుడు తానే వెనుక ఉండి ప్రోత్షిస్తున్నాడనే మా సమాజం భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ వైఖరి చెప్పండి అని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకర్ నాయక్, ఎల్ హెచ్ పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ రాజేష్ నాయక్,సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యకులు భూక్యా సంజీవ్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ రమేష్ నాయక్, సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లావుడియా ప్రసాద్ నాయక్, సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ హుస్సేన్ నాయక్ ,జాక్ నాయకులుమాజీ చైర్మన్ వీరు నాయక్ ,ఏజెన్సీ పరిరక్షణ కమిటీ లాల్సింగ్ నాయక్, రమేష్ రాథోడ్ టీజీ టిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్. టి ఎస్ టి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఈరు నాయక్, భాస్కర్ నాయక్ ,బాబూలాల్ నాయక్ ,బాలకృష్ణ నాయక్ ,రాములు నాయక్ చందర్ నాయక్ ,లాలూ. బానోత్ రాములు నాయక్ లైవ్ రాష్ట్ర అధ్యక్షులు రాజ్ కుమార్ జాదవ్.జంకి లాల్ నాయక్, గుగులోత్ మోహన్ నాయక్. కాన్షిరాం, సురేష్ నాయక్, మాలోత్ విజయ్, లౌడియా వెంకటేశ్వర్లు శ్రీను .కేశవ్ నాయక్, జయరాం,గుగులోత్ భద్రు నాయక్, కుశ నాయక్. దేవిలాల్, రవి బానోత్. చందర్ నాయక్. భూక్యా మంగీలాల్ నాయక్ తదితరులు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

