Mon. Feb 2nd, 2026

J365 NEWS,     భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా విడుదలయ్యే బూడిదను నిబంధనలను పరిశీలించి నిరుద్యోగులైన గిరిజన యువతి యువకులకు తరలించే బాధ్యతలను బిటిపిఎస్ అధికారులు ఎక్కువ శాతం చేయూత అందించి వారి కుటుంబాలను పోషించుకొనే వెసులుబాటు కల్పించాలని ఐ టి డి ఏ ప్రాజెక్ట్ అధికారి బి. రాహుల్ అన్నారు. 
గురువారం నాడు మణుగూరు లోని బీటీపీఎస్ అధికారులతో తన చాంబర్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ కింద భూములు కోల్పోయిన గ్రామాలలోని గిరిజన యువతి యువకులకు మరియు గిరిజన కుటుంబాలకు బి టి పి ఎస్ ద్వారా విడుదలయ్యే బూడిదను తరలించుకొని జీవనోపాధి పెంపొందించుకునేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. బి టి పి ఎస్ కింద భూములు కోల్పోయిన గ్రామాలు దమ్మక్కపేట, సాంబయ్య గూడెం, సీతారాంపురం, పోతిరెడ్డిపల్లి గ్రామాలలో ఆరు సొసైటీలు ఉన్నాయని అన్నారు. దమ్మక పేట సొసైటీలో 31 మంది, సాంబయ్య గూడెం సొసైటీలో 38 మంది, సీతారాంపురం సొసైటీలో 33 మంది, పోతిరెడ్డిపల్లిలో మూడు సొసైటీలు కలిపి 253 మంది గిరిజన యువతి యువకులు సొసైటీల ద్వారా జీవనోపాధి పొందుతున్నారని అన్నారు. అందుకు బి టి పి ఎస్ అధికారులు బూడిద తరలించే బాధ్యత ఎక్కువ శాతం వీరికే అప్పగించాలని సూచించారు. అలాగే బి టి పి ఎస్ లో గిరిజన యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు, ఆ గ్రామాలలోని కుటుంబాలకు ఇతర పనులు కల్పించే అవకాశం తో పాటు వీరికి అన్ని విధాల సహాయ సౌకర్యాలు అందే విధంగా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, బి టి పి ఎస్ సి ఈ బిచ్చన్న,డి ఇ మురళీకృష్ణ, ఎస్ ఇ శ్రీనివాస్, శివచంద్ర తదితరులు పాల్గొన్నారు.

Share this post...