Sun. Jun 14th, 2026

J365news, ఉట్నూర్ : తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ గెజిటెడ్ హెడ్‌మాస్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర సర్వసభ్య సమావేశం మరియు రాష్ట్ర శాఖ ఎన్నికలు ఉట్నూర్ కేంద్రంలోని PMRC భవనంలో ఘనంగా నిర్వహించబడ్డాయి.

ఈ ఎన్నికలలో గెజిటెడ్ హెడ్‌మాస్టర్  రాథోడ్ ప్రకాష్  రాష్ట్ర అధ్యక్షులుగా, వరంగల్ జిల్లాకు చెందిన సారయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యవర్గంలో గౌరవ అధ్యక్షులుగా  శ్రీరాములు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా  బద్రు, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా ఉద్ధవ్ ఎంపికయ్యారు. అలాగే రాష్ట్ర చీఫ్ అడ్వైజర్లుగా అశోక్ కుమార్ , చందన్ , అత్రం భాస్కర్, డి . సుధాకర్ , సనత్ కుమార్ శాస్త్రి  తదితరులు నియమితులయ్యారు.

ఈ సమావేశానికి ఖమ్మం ఉమ్మడి జిల్లా, వరంగల్ ఉమ్మడి జిల్లా మరియు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు చెందిన గిరిజన సంక్షేమ శాఖ గెజిటెడ్ హెడ్‌మాస్టర్లు పెద్ద సంఖ్యలో హాజరై సమావేశం మరియు ఎన్నికలను విజయవంతం చేశారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు సంఘ బలోపేతం, గిరిజన సంక్షేమ విద్యాభివృద్ధి, ఉపాధ్యాయులు మరియు గెజిటెడ్ హెడ్‌మాస్టర్ల సంక్షేమం కోసం సమిష్టిగా కృషి చేయాలని సంకల్పించారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు చీఫ్ అడ్వైజర్లందరికీ హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి నాయకత్వంలో సంఘం మరింత అభివృద్ధి చెందాలని, గిరిజన విద్యారంగానికి విశిష్ట సేవలు అందించాలని ఆక్షించారు.

Share this post...