J365న్యూస్( సుజాతనగర్):రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు రైతులు వరి పంట కాకుండా ఇతర ఆరు తడి పంటలు సాగు చేసుకోవాలని ఇరిగేషన్ డి.ఈ. భాస్కర్ తెలియజేశారు.
మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు కలిసి సమావేశం వరి పంట సాగులపై సలహాలు సూచనలపై సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగభూపాలెం చెరువు ఆయకట్టు రైతులు పంటలు సాగు చేసుకునేందుకు ఈ ఖరీఫ్ సీజన్లో కుడి ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తామని తెలియజేశారు.
ప్రస్తుతం ఎలినినో ప్రభావంతో వర్షపావ కారణంగా చెరువులో నీటి సామర్థ్యం తక్కువ ఉన్న నేపథ్యంలో భవిష్యత్తు అవసరాల దృశ్య ఆ యొక్క రైతులు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పూర్తిస్థాయిలో నీరు అందించడం అవకాశం ఉండదన్నారు
వారబంది ప్రకారం వారం విడిచి వారం కుడి ఎడమ కాలువల ద్వారా మాత్రమే నీరు అందిస్తామని తెలిపారు. రైతులు తమ సొంత వ్యాయ ప్రయాసాలతో మాత్రమే సాగు చేసుకోవాలని సాగునీరు అందక పంట నష్టం జరిగితే నీటిపారుదల శాఖ అధికారులకు ఎటువంటి బాధ్యత లేదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సుజాతనగర్ తాసిల్దార్ కృష్ణ ప్రసాద్ ఏవో నర్మద ఏ.ఈ.ఈ. నిరోషా,వర్క్ ఇన్స్పెక్టర్ పోతురాజు వెంకట్రావు అధికారులు ప్రజాప్రతినిధులు రైతులు తదితరులు పాల్గొన్నారు. 
