Mon. Feb 2nd, 2026

వైరా జనవరి 23(j365 న్యూస్ )వైరా మండలంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ చేతుల మీదుగా స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర క్యాలెండర్ ను ఆవిష్కరించినారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి త్వరగా పరిష్కారం అయ్యే దిశగా కృషి చేయాలని విజ్ఞప్తి చేసినారు . స్థానిక శాసనసభ్యులు మాలోత్ రామదాసు నాయక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉపాధ్యాయుల సమస్యలను తీసుకొని వెళ్లి త్వరితగతిన పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో ఎస్టిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే. మన్సూర్ మండల అధ్యక్షుడు పెనుగొండ ఉపేంద్రరావు, కార్యదర్శి చవల ప్రకాశం, జిల్లా బాధ్యులు ఆర్. అచ్యుతు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ దుర్గాప్రసాద్, కాంగ్రెస్ యువజన నాయకులు జవ్వాజి నాగరాజు, జిల్లా కాంగ్రెస్ నాయకులు దాసరి దానియేలు, ఆది ఆనందరావు, శీలం నర్సిరెడ్డి తదితరులు పాల్గొనినారు.

Share this post...