ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన సీపీఎస్ విధానం రద్దు చేసి,పాత పెన్షన్ విధానం అమలు పర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉద్యోగులు,ఉపాధ్యాయులు,పెన్షనర్ల జెఎసి ఆధ్వర్యంలో మంగళవారం కొత్తగూడెం బస్ స్టాండ్ సెంటర్లో ఆందోళన నిర్వహించారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తక్షణమే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.సీపీఎస్, యుపీఎస్ పథకాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు,వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు