కోటి మొక్కలు నాటి పద్మశ్రీ అవార్డు పొందిన శ్రీ వనజీవి రామయ్య స్వర్గస్తులైనారు. వారి గుర్తుగా భద్రాద్రి కొత్తగూడెం రామవరం లో వనజీవి రామయ్య గుర్తుగా మొక్కలు నాటి ఘన నివాళులు అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మహమ్మద్ రజాక్ (సింగరేణి కాలరీస్ కొత్తగూడెం ఏరియా ఐఎన్ టియూసీ వైస్ ప్రెసిడెంట్) మాట్లాడుతూ ప్రపంచానికి పచ్చదనాన్ని అందించటానికి తన జీవితాన్ని త్యాగం చేసి కోట్లాది గింజలని చెట్ల కింద ఏరి వాటిని చెట్లుగా మలిచి ఎందరికో ఆదర్శంగా ఉన్నారు అని వారు ఈ సందర్భంగా వారి గురించి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వనజీవి రామయ్య గారికి ఘన నివాళులు అర్పించిన షేక్ గౌస్ భాయ్, (సింగరేణి కొత్తగూడెం ఏరియా ఐఎన్టీయూసీ చీఫ్ ఆర్గనైజేషన్ సెక్రటరీ),శ్రీమతి మాధవిగౌస్, మల్లికార్జున్, మధు, షంషీర్, మస్తాన్, కె ఎన్ రాజశేఖర్ ప్రధాని చే ప్రశంసలు అందుకున్న ప్రకృతి ప్రేమికుడు పాల్గొన్నారు..