టీఎస్ యుటిఎఫ్ భద్రాచలం మండల కమిటీ తరఫున మండల విద్యాధికారి తోటమళ్ళ రమ గారికి ఉపాధ్యాయ సమస్యలపై ప్రాతినిధ్యం అందించారు. వేసవిలో ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులకు 3 ELS మంజూరు చేయాలని, పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న వారికి 2 CCLలు ఇవ్వాలని కోరారు. జనగణన 2026 విధులకు సీనియార్టీ ప్రాతిపదికన ఎంపిక చేయాలని, దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్న ఉపాధ్యాయులను మినహాయించాలని విజ్ఞప్తి చేశారు.ఎంఈఓ రమ మాట్లాడుతూ అన్ని సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎస్ విజయ్ కుమార్, మండల అధ్యక్షుడు కొమరం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పి ఎస్ వి ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు.
