జాతీయ స్థాయిలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కొత్తగూడెం విద్యార్థుల ప్రతిభ – క్రీడల్లో విజయ ఢంకా…మార్చి 13, 14, 15 తేదీలలో కేరళ రాష్ట్రం, కొల్లంలో నిర్వహించిన జాతీయ స్థాయి ఆటల పోటీలు (ఆల్ ఇండియా సౌత్ జోన్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2025-26)లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గవర్నమెంట్ పాలిటెక్నిక్, కొత్తగూడెం విద్యార్థులు ప్రతిభ కనబరిచి విశిష్ట విజయాలను సాధించారు.ఈ పోటీలలో బాలుర బ్యాడ్మింటన్ విభాగంలో రిషిక్ తకూర్, రుత్విక్ (ఈఈఈ 3వ సంవత్సరం) జట్టు 3వ స్థానం సాధించారు. బాలుర టేబుల్ టెన్నిస్‌లో రిషిక్ తకూర్, కార్తిక్, అభిరామ్ (ఈఈఈ 3వ సంవత్సరం) జట్టు 4వ స్థానాన్ని పొందింది. అలాగే డిస్కస్ త్రో విభాగంలో దీక్షిత్ (ఈఈఈ 2వ సంవత్సరం) పాల్గొని ప్రతిభ చాటాడు.ఈ విజయాలతో విద్యార్థులు తెలంగాణ రాష్ట్రానికి కీర్తి తెచ్చారు. బహుమతులు గెలుచుకున్న విద్యార్థులను మరియు పీడీ కృష్ణారావును ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్‌తో పాటు అన్ని విభాగాధిపతులు, సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు.
