లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు రావు కిరణ్ కుమార్ పాల్గొని గ్రామానికి సంబంధించిన పలు ముఖ్య అంశాలపై చర్చించారు.గ్రామంలోని అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆయన సూచించారు. అలాగే అంగన్వాడీ ఆయా నియామకం గురించి కూడా ప్రస్తావించారు. ఇందిరమ్మ ఇళ్లను పారదర్శకంగా, రాజకీయాలకు అతీతంగా అర్హులైన వారికి కేటాయించాలని స్పష్టం చేశారు.హై స్కూల్‌లో పేరెంట్స్-టీచర్స్ మీటింగ్‌ల సమాచారం వాట్సాప్ ద్వారా తల్లిదండ్రులకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనంగా, విద్యార్థులకు మినరల్ వాటర్ సదుపాయం కల్పించేందుకు దాతల సహకారం పొందాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, ప్రజ ప్రతినిధులు, సెక్రెటరీ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
