ఆదివాసి ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర నాయకులు వాసం కుమార్ స్వామి, కుంజ శ్రీను అనారోగ్యంతో ఉండటాన్ని తెలుసుకుని వారి నివాసానికి వెళ్లి పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకుంటూ, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ పరామర్శ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు మోకాళ్ల శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కబ్బాకుల రవి, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు సిద్దబోయిన బిక్షం, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు పాయం ఆనందరావు, జిల్లా బాధ్యతలు ఊకే కృష్ణ, తాటి సమ్మయ్య పాల్గొన్నారు.
