భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామవరం సాధన గ్రౌండ్లో జిల్లా సీనియర్ అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహించారు. జిల్లా క్రీడల అధికారి ఎం. పరంధామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఒలంపిక్ జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. క్రీడా పోటీలు, శిక్షణ ద్వారా క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.అనంతరం జరిగిన సభలో ఎర్రవెల్లి శంకర్, కూరపాటి సుధాకర్ రాజు, ఆకునూరి సుప్రియ, మునిగడప పద్మ క్రీడల అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. మోరి రమేష్ సాధన గ్రౌండ్ అభివృద్ధి కోరారు. కే. మహీధర్ ఈనెల 11న హనుమకొండలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు 20 మందిని ఎంపిక చేస్తామని తెలిపారు. డి. మల్లికార్జున్, రియాజ్ పాషా ఆధ్వర్యంలో జొన్నగిరి ప్రసాద్, పవన్ పిడి శ్వేతాలు ఎంపికలు నిర్వహించారు. జాకీర్, సుభాష్, ముస్తఫా క్రీడాకారులకు స్నాక్స్ అందజేశారు.
